Telugu Strengths and Achievements
తెలుగు విభాగం బలాలు
1. మా విభాగంలో Ph.D, NET అర్హత కలిగిన మరియు అనుభవజ్ఞులైన, నిబద్ధత కలిగిన అధ్యాపకులు ఉన్నారు.
2. సాంప్రదాయ సాహిత్యంతో పాటు ఆధునిక తెలుగు సాహిత్యం, భాషా విజ్ఞానం పై సమతుల్య బోధన.
3. వ్యాస రచన, కవితా పోటీలు, వాదన–ప్రతివాదన, నాటికలు మొదలైన వాటి ద్వారా ప్రతిభా అభివృద్ధి
4. ఉపన్యాసాలు, పత్రసిద్ధి, సదస్సులు, పరిశోధనా వ్యాసాల రూపకల్పనలో విద్యార్థులకు మార్గదర్శనం.
5. భాషా దినోత్సవాలు, సాహిత్య సదస్సులు, స్థానిక కవులతో సంభాషణల ద్వారా సమాజ అనుసంధానం
6. తెలుగు సాహిత్య సమితి ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే వేదికను అందిస్తున్నాము.
7. పుస్తక ప్రదర్శనలు, వ్యాసరచన, పద్యపఠనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థుల్లో భాషాభిరుచిని, సాహిత్యాభిరుచిని పెంపొందిస్తున్నాము.
8. పాత–కొత్త తెలుగు గ్రంథాల సమాహారం, పరిశోధనకు అనుకూల వనరులు అందుబాటులో ఉన్నాయి.
9. పత్రికా రంగం, అనువాదం, ఉపాధ్యాయ వృత్తి, సాహిత్యరచన వంటి రంగాలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాము
10. ఈ-కంటెంట్, ప్రెజెంటేషన్లు, వీడియో లెక్చర్లు ద్వారా బోధనలో సాంకేతిక వినియోగం.
11. విద్యార్థులు విశ్వవిద్యాలయ పరీక్షల్లో నిరంతరం మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
12. మా విద్యార్థులు విశ్వవిద్యాలయ పరీక్షల్లో అగ్రశ్రేణి ఫలితాలు సాధించేలా మేము ప్రోత్సహిస్తున్నాము.
13. కొత్త కోర్సులు, పబ్లికేషన్లు, మౌలిక వసతుల విస్తరణతో నిరంతర అభివృద్ధి దిశలో విభాగం కొనసాగుతోంది.
14. మా విభాగం బోధనలో ఆధునిక పద్ధతులను అనుసరించి విద్యార్థి కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నాము.
15. పరిశోధనా దృక్పథం కలిగిన విద్యార్థులను తయారుచేయడానికి మార్గదర్శకత్వం అందిస్తున్నాము.
16. స్థానిక సాంస్కృతిక సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
తెలుగు విభాగం విజయాలు
1. మా విద్యార్థులు ప్రతీ సంవత్సరం ఉన్నత విద్యా అవకాశాల ప్రవేశ పరీక్షలలో మంచి ఫలితాలు(ర్యాంక్ లు) పొందుతున్నారు
2. మా విద్యార్థులు విశ్వవిద్యాలయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయి పోటీలలో అనేక బహుమతులు సాధించారు.
3. సాహిత్య సమ్మేళనాలు, సదస్సులు, జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనా వ్యాసాలు సమర్పించారు.
4. ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవం, కవుల జయంతులు, సాహిత్యోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము.
5. స్థానిక కవులు, రచయితలతో సాహిత్య సదస్సులు నిర్వహించి, విద్యార్థుల్లో సాహిత్య చైతన్యాన్ని మేల్కొలుపుతున్నాము.
6. మా విభాగం తరపున ప్రతీ ఏటా “అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము.
7. మేము జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో పరిశోధన వ్యాసాలు ప్రచురిస్తూ తెలుగు పరిశోధనకు తోడ్పడుతున్నాము.
8. భాషా–సాహిత్య అంశాలపై సదస్సులు, వర్క్ షాప్స్ , ఆతిథ్య ఉపన్యాసాలు నిర్వహిస్తున్నాము.
9. మా విద్యార్థులు సాహిత్య–సాంస్కృతిక పోటీలలో పాల్గొని అనేక బహుమతులు గెలుచుకున్నారు
10. మా అధ్యాపకులు, విద్యార్థులు సాహిత్య సంస్థలు, విద్యాసంస్థల నుండి గౌరవాలు, పురస్కారాలు అందుకుంటున్నారు.
11. సాహిత్య, సాంస్కృతిక సంస్థలతో కలిసి భాషా వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో భాగస్వామ్యమవుతున్నాము.
12. మా విభాగ అధ్యాపకులు పత్రికలు, జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు ప్రచురించి తెలుగు పరిశోధనకు తోడ్పడుతున్నారు.
13. కళాశాల స్థాయి సాంస్కృతిక పోటీలలో మా విద్యార్థులు నిరంతరం ప్రతిభ చూపుతున్నారు.
